Take a fresh look at your lifestyle.

భూపాలపల్లి సీఐ చెన్నూరి శ్రీనివాస్‌కు ఐఎన్టీయూసీ ఘన సన్మానం.

0 2

భూపాలపల్లి సీఐ చెన్నూరి శ్రీనివాస్‌కు ఘన సన్మానం.
మర్యాదపూర్వకంగా కలిసిన ఐఎన్‌టీయూసీ నాయకులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్‌-భూపాలపల్లి, సెప్టెంబర్‌ 2: భూపాలపల్లి పోలీస్‌ స్టేషన్‌ నూతన స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, సీఐ చెన్నూరి శ్రీనివాస్‌ బదిలీపై వచ్చి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఏరియా ఐఎన్‌టీయూసీ నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా ఐఎన్‌టీయూసీ బ్రాంచ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బేతెల్లి మధుకర్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్లు జోగ బుచ్చయ్య, ఏ.రఘుపతిరెడ్డి, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ రత్నం సమ్మిరెడ్డి, ఏరియా స్ట్రక్చర్‌ కమిటీ నాయకుడు షేక్‌ హుస్సేన్‌, బ్రాంచ్‌ నాయకులు కుడుదుల శంకర్‌, రవికిరణ్‌ పాల్గొన్నారు. అలాగే ఐఎన్‌టీయూసీ నాయకులు కె. శ్రీనివాస్ రెడ్డి, బండ బాపు, కోచర్ల రవికుమార్‌, పొనగంటి కృష్ణ, సోతుకు సమ్మయ్య, సార శ్రీనివాస్‌, రాజయ్య, శరత్‌కుమార్‌ తదితరులు పాల్గొని నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.