Take a fresh look at your lifestyle.

భూపాలపల్లి ఏరియా నుంచి ఇద్దరు సింగరేణి ఉత్తమ ఉద్యోగుల ఎంపిక.

0 36

                                                                                                                                      భూపాలపల్లి ఏరియా నుంచి ఇద్దరు సింగరేణి ఉత్తమ ఉద్యోగుల ఎంపిక.
కంపెనీ స్థాయిలో కొమురవెల్లి రాజయ్య, ఏరియా స్థాయిలో లకావత్ శంకర్ కు గౌరవం.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నేడు సత్కారం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సింగరేణి సంస్థలో అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులను ఏరియా, కంపెనీ స్థాయిల్లో సత్కరించే సంప్రదాయంలో భాగంగా భూపాలపల్లి ఏరియాకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ప్రతిష్ఠాత్మక ఉత్తమ ఉద్యోగి పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఏరియా అధికార ప్రతినిధి, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్ సుందర్ వెల్లడించారు. కంపెనీ స్థాయి ఉత్తమ ఉద్యోగిగా కేటీకే ఓసీటూ ఉపరితల గనిలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న కొమురవెల్లి రాజయ్య ఎంపికయ్యారు. అలాగే భూపాలపల్లి ఏరియా స్థాయి ఉత్తమ ఉద్యోగిగా కేటీకే-1 భూగర్భ గనిలో ఎస్‌డీఎల్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న లకావత్ శంకర్ ఎంపిక కావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జూన్ 2న మంగళవారం భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో లకావత్ శంకర్‌ను ఏరియా జనరల్ మేనేజర్ ఘనంగా సత్కరించనున్నారు. అదే విధంగా కంపెనీ స్థాయి ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన కొమురవెల్లి రాజయ్యకు కొత్తగూడెంలో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సింగరేణి సీఎండీ చేతుల మీదుగా ఘన సన్మానం జరగనుంది. సింగరేణి అభివృద్ధికి వారు అందించిన విశిష్ట సేవలు, విధి నిర్వహణలో చూపిన అంకితభావం, పనితీరుకు గుర్తింపుగానే ఈ పురస్కారాలు లభించాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన లకావత్ శంకర్, కొమురవెల్లి రాజయ్యలను ఆయా గనుల అధికారులు, ఏరియా అధికారులు, సహోద్యోగులు అభినందిస్తూ వారి సేవలను కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.