కోటగిరిలో పేకాట రాయుల్ల అరెస్ట్

బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 19 ( లోకంతీరు ) : కోటగిరి మండల కేంద్రం లో సోమవారం సాయంత్రం పేకాట ఆడుతున్న వ్యక్తులు అరెస్ట్ అయ్యారు.విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల ను కోటగిరి పోలిసులు అదుపులోకి తీసుకున్నా రు.వారి వద్ద నుండి రూ. 12,300 స్వాధీన పరచుకుని కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామనీ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు.