పేకాట శిబిరాలపై దాడులు…
- పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- పోలీసులు నగదును స్వాధీనం.
- ముమ్మరంగా కొనసాగుతున్న దాడులు.

కోటగిరి , జనవరి 26 ( లోకం తీరు ) : బాన్సువాడ నియో జక వర్గం పోతంగల్ మండల కేంద్రంలోని కొల్లూరు గ్రామ శివారులో అలాగే కొల్లూరు చెరువు వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై శుక్రవారం స్థానిక పోలీసులు దాడి చేశారు.రెండు చోట్ల పేకాడుతున్న పన్నెండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి రూ.19650 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు ఎస్ఐ సందీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు