Take a fresh look at your lifestyle.

వృద్ధురాలుకు ఏ నెగిటివ్ రక్తం అందజేత…

0 1,081

వృద్ధురాలుకు ఏ నెగిటివ్ రక్తం అందజేత

– నిజామాబాద్ లో వారికి కావలసిన రక్తం దొరకకపోవడంతో       

   కామారెడ్డిలో అందజేత
– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త

  డాక్టర్ బాలు

కామారెడ్డి జిల్లా , ఆగస్టు 25 (లోకంతీరు) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అత్యవసరంగా శారద (60) సంవత్సరాల వృద్ధురాలికి ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొరకకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు వెంకటరమణ సహకారంతో అందజేసారు. ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో రక్త కొరతతో అన్ని రక్తనిధి కేంద్రాలలో రక్త నిల్వలు తగ్గిపోవడం జరిగిందని డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి కావలసిన ప్లేట్ లెట్స్ కూడా అందడం లేదన్నారు. రక్తదాతలు ఉన్నప్పటికీ అపోహల వలన ప్లేట్ లెట్స్ అందజేయడానికి ముందుకు రావడం లేదని, అపోహలు విడనాడి ముందుకు రావాలన్నారు. 23 వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన రమణకు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నల తరఫున అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్, ఉపాధ్యక్షులు జమీల్, డాక్టర్ పుట్ల అనిల్, గంప ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కిరణ్, ఎర్రం చంద్రశేఖర్, శ్రీకాంత్ రెడ్డి

Leave A Reply

Your email address will not be published.