Take a fresh look at your lifestyle.

ఉద్యమకారుల ఫ్యాక్టరీ పి.డి.యస్.యు ఆత్మీయ సమ్మేళనం…..

0 1,269

ఉద్యమకారుల ఫ్యాక్టరీ పి.డి.యస్.యు ఆత్మీయ సమ్మేళనం

నిజామాబాద్, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.యస్.యు) పూర్వ, ప్రస్తుత విద్యార్థి మిత్రుల ఆత్మీయ సమ్మేళనం నిన్న రాత్రి నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగింది.ఈ సభలో పి.డి.ఎస్.యు పూర్వ ప్రస్తుత విద్యార్థి మిత్రులు తమ అనుభవాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఉద్యమకారులు, ప్రజా ప్రతినిధులు పి.డి.ఎస్.యు సంస్థ నుండి వచ్చారన్నారు. అందుకే పి.డి.ఎస్.యు ఉద్యమకారుల ఫ్యాక్టరీ అన్నారు. పి.డి.ఎస్.యులో పనిచేసే విద్యార్థులు ఉద్యమాల్లోనే కాదు, చదువులోనూ చురుకుగా ఉంటారన్నారు. మతోన్మాదం, సామ్రాజ్యవాదం పెనవేసుకుని దేశాన్ని, దేశ ప్రజలను సంక్షోభంలోకి నెడుతున్న సందర్భంలో, పి డి ఎస్ యు చారిత్రక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. పి.డి.ఎస్.యు స్వర్ణోత్సవ సభలు అందుకు వేదిక కావాలన్నారు. సెప్టెంబర్ 30న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే పి.డి.ఎస్.యు 50 వసంతాల స్వర్ణోత్సవ సభలను జయప్రదం చేయాలని పూర్వ, ప్రస్తుత విద్యార్థి మిత్రులు పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో అరుణోదయ, ప్రజా కళాకారులు సిర్ప లింగం తదితరులు పాటలు పాడి సమావేశాన్ని ఉత్సాహపరిచారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు పూర్వ నాయకులు నర్సింలు, శివరాజు సాయికుమార్, రామ్మోహన్ రావు, రవీందర్, సుధాకర్, చంద్రశేఖర్, సుధారాణి, సంధ్యారాణి, సీతయ్య, సత్యనారాయణ, ప్రేమ్ సింగ్ అరవింద్, భాస్కర స్వామి, బషీర్, రాజు, అజయ్, బీక్ సింగ్, ప్రగతి, కల్పన, కుమార్, గంగారాం, గంగాధర్, నారాయణ, మరియు ప్రస్తుత పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్కగణేష్, నజీర్, మహిపాల్, సృజన్,శివకుమార్,రాజేష్ బబిత్ రాజు,నాగేష్,భను,నవ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.