Take a fresh look at your lifestyle.

సైకిల్ పైన ఇందూర్ నుండి అయోధ్యకు….

0 1,587

సైకిల్ ఇందూర్ నుండి అయోధ్యకు వెళ్లి తిరిగి ఇందూర్ కు …..

 

నిజామాబాద్ అర్బన్, జనవరి 29 ( లోకం తీరు ) : 500 సంవత్సరాల కల శ్రీ అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ. ఆ అయోధ్య శ్రీరాముని దర్శించుకోవడానికి నిజామాబాద్ అర్బన్ నుండి అయోధ్యకు సైకిల్ పై వెళ్లి బాలరాముని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో కాశీ విశ్వనాథుని దర్శించుకుని నిజామాబాద్ కు సిద్దుల రఘునాథ్, రాయికల్ నరేష్ గౌడ్ చేరుకోవడం జరిగింది.గుండేటి మాదవ్, అల్లూరి వరుణ్ లతో కాశీలో కలవటం జరిగిందని గిన్నెల శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు.అలాగే అన్నపూర్ణ దేవి ఆలయంలో వాళ్ళని కలిసి అభినందనలు తెలుపడం జరిగింది. 1200 కిలోమీటర్లు ప్రయాణించి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా భయబ్రాంతులకు లోనుకాకుండా ప్రయాణించడం మాములు విషయం కాదని అదంతా ఆ బాలరాముని అనుగ్రహమేనని, అలాంటి వారు నాకు కలవడం నా అదృష్టం అని ఆయన అన్నారు.అందులో భాగంగా సిద్దుల రఘునాథ్, రాయికల్ నరేష్ గౌడ్ ను నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుండి ఆర్ ఆర్ చౌరస్థలో గల హనుమాన్ మందిరం వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించి స్వాగతం పలుకడం జరిగింది.వారు మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్తిగా ధర్మపురి అరవింద్ రెండవ సారి కూడా ఘన విజయం సాధించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.