అకాల వర్షాలతో నష్టపోయిన కొనుగోలు కేంద్రాలు
-
పరిశీలించిన కిసాన్ మోర్చా పార్లమెంట్ కోఆర్డినేటర్ నూతల శ్రీనివాస్ రెడ్డి

నందిపేట్, ఏప్రిల్ 20 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో గత రెండు రోజులగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా నష్టపోయిన కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ భారతీయ జనతా కిసాన్ మోర్చా, పార్లమెంట్ కోఆర్డినేటర్ నూతల శ్రీనివాస్ రెడ్డి వెళ్లి పరిశీలించారు. అక్కడ వర్షానికి పూర్తిస్థాయిలో పండ్లు తడవడం జరిగింది తూకాలు వేసినటువంటి బ్యాగులు కూడా తడిసిపోవడం జరిగిందని, సీఈఓ ల నిర్లక్ష్యం కారణంగా సరియైన సమయానికి తూకాలు వేయానందుకు అకాల వర్షాలతో పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అన్నారు.
అలాగే కుద్వాంపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రాల వద్ద సందర్శించడం జరిగింది, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున వడ్ల కుప్పలు తడిచిన ధాన్యాన్ని సందర్శించడం జరిగింది.వెంటనే ఆయన జిల్లా జయింట్ కలెక్టర్ గారితో మరియు డిసిఒ గారితో మాట్లాడి తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అలాగే రంగులు మారిన ధాన్యాన్ని కూడా వెంటనే తూకాలు వేసి రైస్ మిల్లర్స్ పంపించవలసిందిగా కోరడం జరిగింది. కొనుగోలు కేంద్రాల వద్ద తాటిపత్రిలు అదనంగా ఉంచాలని రైతులు తూకాలు వేసినటువంటి బస్తాల్ని వెంటనే రైస్ మిల్లర్స్ కి పంపించవలసిందిగా జిల్లా కలెక్టర్ని కోరడం జరిగింది.కుదాన్పూర్ గ్రామంలో పిడుగు పడి మూడు బర్లు చనిపోవడం జరిగింది. నష్టపోయిన పశువుల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది.అదేవిదంగా జిల్లాలో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు తూకాలు వేయవలసిందిగా. కోరడం జరిగింది. జిల్లాలో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని కిసాన్ మోర్చా పార్లమెంట్ కోఆర్డినేటర్ నూతల శ్రీనివాస్ రెడ్డి కోరడం జరిగింది వీరితోపాటు జిల్లా బీజేపీ ఒబిసి ఐటీ సెల్ కన్వీనర్ మంగ్లరపు నవీన్ బూత్ అధ్యక్షులు సాయన్న,రాజు,సుంకరి రాజు కిసాన్ మోర్చా నాయకులు భోజన్న,నాగన్న,విలేందర్ మరియు రైతులు పాల్గొనడం జరిగింది.