జూలై 30న జిపి కార్మికుల “చలో హైదరాబాద్” ను జయప్రదం చెయ్యండి
– గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్ పిలుపు
కామారెడ్డి జిల్లా, జూలై 27 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్ మండలం లో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతు ఈ నెల 30 వ తేదిన నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమనికి జిల్లా లో గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మిక సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు గ్రామ పంచాయతీ కార్మికులందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని, కార్మికులందరికి 10లక్షల జీవిత భీమా కల్పించాలని, మల్టిపర్పస్ విధానం రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. బకాయి పడ్డ వేతనాలు చెల్లిస్తూ ప్రతి నెల 2వ తేదీన వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాజయ్య, మల్లేష్, రాజు, ప్రభాకర్, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.