ప్రత్యేక పూజలలో పాల్గొన మాజీ స్పీకర్…
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, జనవరి 22 (లోకం తీరు) :

అయోధ్య శ్రీరామ మందిర భవ్యక్షేత్రం ప్రారంభోత్సవం మరియు శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట, పోచారం, మోస్రా, జాకోరాలలోని పలు ఆలయాలలో సోమవారం రోజు జరిగిన ప్రత్యేక పూజలలో మాజీ మంత్రి, మాజీ శాసన సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని , రాష్ట్రం ఎల్లప్పుడు సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతునికి వేడుకున్నాను అని అన్నారు. అంతేకాకుండా నియోజకవర్గం లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాటు పాడిపంటలు పండాలని కోరారు.
ఈ పూజలలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.