వంటగది సౌకర్యం లేక క్లాస్ రూమ్ లో వంట..!

సదాశినగర్, జనవరి 31 (లోకం తీరు ) :
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలోని భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో వంటగది లేక క్లాస్ రూమ్ లో వంట చేస్తున్న దృశ్యం. ఉన్నతాధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వంటగది లేక సంవత్సరమవుతున్న క్లాస్ రూమ్ లో వంట చేస్తున్నామని వారు తెలిపారు. వంటగది నిర్మించాలని విద్యార్థులకు ఇబ్బందికరంగా క్లాస్ రూమ్ లో వంట చేయడం ద్వారా విద్యార్థులు పాఠాలు వింటున్నప్పుడు పొగ వారి క్లాస్ రూమ్ లోకి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఇకనైనా స్పందించి ఉన్నతాధికారులు వంటగది నిర్మించాలని, స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందించి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏ పాఠశాలలో ఏ సమస్యలు ఉన్నాయి చూసి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో వెంటనే మధ్యాహ్న భోజనం కు కావలసిన వంటగదిని ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.