Take a fresh look at your lifestyle.

అంతర్జాతీయ కరాటే పోటీలో శ్రీ వివేకానంద హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ.

0 1,628

అంతర్జాతీయ కరాటే పోటీలో శ్రీ వివేకానంద హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ.

  • ముఖ్య అతిథిగా సినీ హీరో సుమన్.
  • 20 మెడల్స్ సాధించిన వివేకానంద హై స్కూల్.

బాన్సువాడ/కోటగిరి, జనవరి 31 ( లోకం తీరు ) :  ఈనెల 28 తేదీ న రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ నకయామ షోటోఖాన్ కరాటే వారి సౌజన్యంలో సెకండ్ కరాటే ఓపెన్ ఇన్విటేషన్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్ వారి ఆధ్వర్యంలో కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో భారతదేశంలోని పలు రాష్ట్రాలతో పాటుగా వివిధ దేశాలకు చెందిన సుమారు 4 వేల మంది విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పోటీలలో ముఖ్యఅతిథిగా సినీ హీరో సుమన్ పాల్గొన్నారు.కోటగిరి మండలంలోని శ్రీ వివేకానంద హై స్కూల్ కు చెందిన 20 మంది విద్యార్థినీ,విద్యా ర్థులు ఈ పోటీలో పాల్గొని ఆయా విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచి 20 పథకాలు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రజనీ, బోధన్ కరాటే మాస్టర్స్ ఖయ్యుం,పల్లవి తెలిపారు.ఈ పోటీలో సాధించిన గోల్డ్,సిల్వర్ మెడల్స్,పథకాలను కోటగిరి ఎస్.ఐ సందీప్ కుమార్ అలాగే పాఠశాల యాజమాన్యం,కరాటే మాస్టర్ల చేతుల మీదుగా విద్యార్థినీ,విద్యార్థులకు అందజేసి అభినందించారు.రాబోయే రోజుల్లో ఆయా క్రీడల్లో మంచి తర్ఫీదు పొంది మరెన్నో పథకాలు సాధించాలని ఎస్సై సందీప్ కుమార్ ఆకాంక్షించారు.కరాటే మాస్టర్ ఖయ్యూం ఆధ్వ ర్యంలో గ్రామీణ ప్రాంతానికి చెందిన శ్రీ వివేకానంద హై స్కూల్ కు చెందిన 20 మంది విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలలో ఏలాంటి బెదురు లేకుండా పోటీలలో విజయం సాధించి విజయఢంక మోగించి పలు విభాగాలలో గోల్డెన్ సిల్వర్ మెడల్స్ తో పాటుగా ప్రశంస పత్రాలను అందుకున్నందుకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు,తోటి విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేసి వారిని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.