ప్రత్యేక అధికారులతో సమావేశన్ని ఏర్పాటు చేసిన ఎంపీడీవో
బాల్కొండ నియోజవర్గం ,ఫిబ్రవరి 1 ( లోకం తీరు) : బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారులతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో ప్రత్యేక అధికారులు శుక్రవారం ఉదయం 9 గంటలకు బాధ్యతలు స్వీకరించాలని ఎంపీడీవో సంతోష్ కుమార్. వారికి సూచించారు. పారిశుద్ధ్యం,త్రాగునీటి సరఫరా, పల్లె ప్రగతి పనులు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా ప్రత్యేక అధికారులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. దీనికి మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పూర్తిస్థాయిలో సహాయక సహకారాలు అందించాలని తెలిపారు.