Take a fresh look at your lifestyle.

స్ఫూర్తి ధైర్యం సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు….

0 1,066

స్ఫూర్తి ధైర్యం సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పోరాటాల పొద్దుపొడుపు సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గైని శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ తెగువకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ అన్నారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న దొరల దేశం రజాకార్లను గడగడ లాటించిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా పోరాటాలకు కొనసాగించాలని అప్పుడు నిజం నవాబుకు రజాకార్లకు భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కొట్లాడుతున్నారు. అయితే ఐలమ్మ పోరాట స్ఫూర్తితో కమ్యూనిస్టులు ఇంకిత రెట్టించిన ఉత్సవంతో ఎర్రజెండాలు పట్టుకొని రజాకార్లతో పోరాటానికి దిగుతుండగా ఈ సమయంలో తన ఇంటినే సాయుధ పోరాటానికి కార్యాలయంగా చేసింది పాలకుర్తి దొర గడి మీద దాడి చేసి ధాన్యాన్ని 90 ఎకరాల భూమిని ప్రజలకు పంచారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే సాగిన సాయుధ పోరాటంలో వేలాదిమంది అమరులయ్యారు.

Leave A Reply

Your email address will not be published.