Take a fresh look at your lifestyle.

జడ్పిహెచ్ఎస్ కారేగాంలో గోరుముద్ద కార్యక్రమం…..

0 1,373

జడ్పిహెచ్ఎస్ కారేగాంలో గోరుముద్ద కార్యక్రమం.

బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 6 ( లోకం తీరు ) :  బాన్సువాడ నియోజక వర్గం పోతంగల్ మండలం కారేగాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆచన్ పల్లి శాఖ వారు 10వ తరగతి విద్యార్థులకు మంగళవారం అల్పాహారం అందజేశారు.పదవ తరగతి విద్యార్థులకు 40 రోజుల పాటు జరిగే ప్రత్యేక తరగతులకు గోరు ముద్ద కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పండ్లు, బిస్కెట్స్,మజా డ్రింక్స్ తో పాటు పలు రకాల స్నాక్స్ ఇచ్చి విద్యార్థులకు చదువులో ప్రోత్సహించడానికి ఈ గోరుముద్ద కార్యక్రమాన్ని చేపడుతున్నామని లయన్స్ క్లబ్ ఆచన్ పల్లి శాఖ వారు తెలిపారు.ఈ గోరుముద్ద కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆచన్ పల్లి రీజనల్ చైర్మన్ శివ నాగేశ్వరరావు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.దుర్గారావు,లయన్స్ క్లబ్ ప్రతినిధులు చక్రవర్తి, వెంకటేశ్వరరావు,రామకృష్ణ, గాంధీ,శ్రీనివాసరాజు,హరిబాబు,కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.