నూతన మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ లు ఎన్నిక

కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 27 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఆయా మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లను నూతనంగా శుక్రవారం ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఎంపీ సురేష్ శేట్కార్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం.ఎల్లారెడ్డి టౌన్ లో గల ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్ నందు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఎంపీ సురేష్ శేట్కార్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం జరిగింది.ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గా రజిత వెంకట్ రెడ్డి వైస్ చైర్మన్ గా రాజు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు లింగంపేట్, నాగిరెడ్డి పేట్, ఎల్లారెడ్డి మండలాలకు చెందిన నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ..!ముందుగా ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన రైతులకు, అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, పత్రిక మిత్రులకు శుభా కాంక్షలు తెలిపారు.నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ కి డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు. ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ అభివృద్ధి చెంది రాష్ట్రంలో ఉన్నతమైన స్థాయికి రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.ఎల్లారెడ్డి తో పాటు సదాశివనగర్, గాంధారిలో నూతన చైర్మన్ లను నియమించడం జరిగింది. సదాశివనగర్ గాంధారి కమిటీ చైర్మన్ లు ఎన్నికైన వారి గురించి మాట్లాడుతూ కేవలం సామాన్య కార్యకర్తలుగా ఉన్న పరమేష్, సంగ్య నాయకులకు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. సంగ్య నాయక్ సామాన్యమైన ఒక కార్యకర్త, మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే ఎమ్మెల్యే తర్వాత అత్యున్నత పదవి ఆ పదవి కోసం ఎంతో మంది నా దగ్గరికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. అయినా నేను దేనికి లొంగకుండా నమ్మకమైన సామాన్య కార్యకర్త ను ప్రోత్సహించాలని సంగ్య నాయక్ కు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నా వెన్నంటి ఉండి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఏదో విధంగా పదవి ఇస్తాను. పదవి రానివారు ఎవ్వరు అధైర్య పడొద్దు. రానున్న రోజుల్లో ఇందిరమ్మ కమిటీలు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు ఇవ్వడం జరుగుతుంది. నా దగ్గర ఎటు వంటి పైరవీలు పనిచేయవు కష్టపడ్డ వారికే పదవి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది.మన నియోజకవర్గంలో చాలా మంది వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు. వరి మక్కా పత్తి పంటలతో పాటు కొత్త రకమైన అధిక దిగుబడి అధిక లాభాల ను అందించే పంటలను వేయాలి. యువ రైతులకు ఎల్లప్పుడూ నా ప్రోత్సాహం ఉంటుంది. కొత్త రకమైన పంటలు సరికొత్త విధానాలతో పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చు. మనకు దగ్గరలోనే మారుతున్న దగ్గర అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. మీ కొడుకులకు బిడ్డలకు అగ్రికల్చర్ లో విద్యను అభ్యసించి సరికొత్త విధానాలను రూపొందించే విధంగా తయారు చేయండి. నేను కూడా అగ్రికల్చర్ కాలేజీ లో నే చదువుకున్నాను. నాకు కూడా వ్యవసాయం అంటే చాలా మక్కువ అన్నారు. నియోజకవర్గం లో నకిలీ విత్తనాలకు తావు లేకుండా, వరి కొనుగోలు విషయాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైన సమయంలో కొనుగోలు చేయాలని అధికారులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించమని చెప్తున్నాను. గత సంవత్సరంలో తెల్ల జొన్నల విషయంలో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని అధికారులు సూచించడం జరిగింది.రైతులు రుణమాఫీ విషయంలో కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకుంటుంది. మన నియోజకవర్గంలో 29739 మందికి రుణమాఫీ ఇవ్వడం జరిగింది.రైతన్నకు పుష్కలంగా రెండు పంటలు పండే విధంగా ప్యాకేజీ 22 పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తంకుమార్ రెడ్డి తో ఇరిగేషన్ అధికారులతో నాలుగు గంటలు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది.త్వరిత గతిన నిధులు మంజూరు చేసి మూడు ప్రాజెక్టులు మోతే కాటేవాడి బ్రిడ్జిలు పూర్తి చేసి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కరువు అనేది లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నాను.వీటితో పాటు పోచారం ప్రాజెక్టుకు ఉడిక తీత వివిధ అంశాలకు సంబంధించిన పనులపై సర్వే నిర్వహించాలని ఇరిగేషన్ మినిస్టర్ ని కోరడం జరిగింది. ఇటీవల కాలంలో పోచారం కెనాల్ కి రిపేర్ వస్తే ఆ పనులను కూడా పూర్తి చేయించాను.నేను గెలిచిన అంత తక్కువ కాలంలోనే ఎల్లారెడ్డి మున్సిపల్ లో ట్యాంక్ బండ్, పార్కు, టు ఫీడ్కో అమృత 2.0 ద్వారా ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మున్సిపల్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాను.అలాగే దసరా రోజు బృహోత్తరమైన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. పేదల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే విధంగా దసరా రోజు డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ చేపడుతున్నాం. ఈ దసరా వాళ్ళ జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది.ఇటీవల లింగంపేటలో 400 క్రితం నాటి పురాతన మెట్ల బావిని నా సొంత నిధులు 10 లక్షలతో బావిని పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఎల్లారెడ్డి లో కూడా ఉన్న మెట్ల బావులను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాను.గాంధారి మండల కేంద్రంలో ఐదు ఎకరాలలో మినీ స్టేడియం తీసుకురావడం జరిగింది. మొన్న కురిసిన వర్షాలకు గ్రామాలలో వచ్చిన సమస్యలను వెను వెంటనే పూర్తి చేయిస్తూ అధికారులకు ఆదేశిస్తూ పరిష్కరించడం జరిగింది. గ్రామాలు పారిశుధ్య పనులను నిత్యం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆరోగ్య ఎల్లారెడ్డిగా చేయాలని కృషి చేస్తున్నాను.ఎల్లారెడ్డి లో ఉన్న పేద ప్రజలకు ఆసరాగా ఉండాలని ఆరోగ్యపరంగా ఎటువంటి ఆపద వచ్చిన ఎల్ఓసి, సీఎంఆర్ఎఫ్ ల ద్వారా పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాము. నియోజకవర్గంలో నూతనంగా మరో అద్భుతమైన రోడ్డుకు శ్రీకారం చుట్టబోతున్నాము. కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి కే కే వై రోడ్డు, రోడ్డును త్వరగా ప్రారంభించాలని ఆర్ అండ్ బి మినిస్టర్ ని కోరడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధిలో నాతోపాటు పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలియజేస్తూ నూతనంగా ఎన్నుకోబడిన మార్కెట్ కమిటీ చైర్మన్ లకు, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.