Take a fresh look at your lifestyle.

పిల్లలను ఎత్తుకెళ్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో అప్రమత్తం..బాల్కొండ పోలీసులు

0 1,370

బాల్కొండ మండల కేంద్రంలో విద్యార్థులకు అవగాహన కల్పించిన బాల్కొండ పోలీసులు

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి ,ఫిబ్రవరి 10 ( లోకంతీరు ) : బాల్కొండ మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థులకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ పిల్లలను ఎత్తుకెళ్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించామన్నారు. అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఏఎస్సై శంకర్ బాల్కొండ పోలీస్ సిబ్బంది మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శంకర్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.