Take a fresh look at your lifestyle.

ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలి….పంచాయతీ రాజ్ కమిషనర్

0 1,627

ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలి

– పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనిత

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : ప్రతి ఇంటికి తాగునీటిని అందించాలని పంచాయతీ రాజ్ కమిషనర్ టీవీ అనిత రామచంద్రన్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా స్థాయి అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేసి వచ్చే వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో ఏడు రకాల రిజిస్టర్లను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ప్రతిరోజు క్లోరినేషన్ చేసిన నీటిని వాటర్ ట్యాంక్ ద్వారా ప్రజలకు అందించాలని చెప్పారు. పైప్ లైనుల మరమ్మత్తులు ఉంటే తక్షణమే బాగు చేయించాలని కోరారు. ప్రతి నెలలో నాలుగు సార్లు వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని తెలిపారు.1,10,20,30వ తేదీల్లో వాటర్ ట్యాంకులు శుభ్రం చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రిజిస్టర్లను పరిశీలించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ కృపాకర్ రెడ్డి, డిపిఓ శ్రీనివాసరావు, జెడ్పి సీఈవో సాయ గౌడ్, జిల్లా మిషన్ భగీరథ ఈఈ. రమేష్, గ్రిడ్ ఈఈ స్వప్న, డిప్యూటీ ఇంజనీర్లు శివకుమార్, రమేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.