Take a fresh look at your lifestyle.

మాపై నిందలు వేస్తే ఊరుకోం….

0 1,375

మాపై నిందలు వేస్తే ఊరుకోం… 

  • సిద్దిపేట మాజీ మునిసిపల్ చైర్మన్ రాజనర్స్…


సిద్దిపేట, ఫిబ్రవరి 24 ( లోకంతీరు ) : మాపై అనవసర నిందలు వేస్తే ఊరుకోం అని మాజి నుడ చైర్మన్ అన్నారు.శనివారం అయన మీడియా సమావేశంలో మాట్లాడారు.కొన్ని పత్రికలలో మాపై వచ్చిన వార్తలు అవాస్తవం, బాధాకరం అని మాపై నింద మోపడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారన్నారు.కౌన్సిలర్ గా, చైర్మన్ గా 20ఏండ్ల నుండి సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆస్తిని కాపాడుతునే ఉన్నాం అన్నారు.కొంతమంది మున్సిపల్ స్థలాన్ని కులాల పేరిట ఆక్రమించు కోవాలని చూస్తున్నారన్నారు.వారి పబ్బం గడుపుకోవలనే ఆలోచన చేస్తున్నారన్నారు.
మాపై ఆరోపణలు చేసిన వారిపై పోలసులకు పిర్యాదు చేస్తామన్నారు.

పట్టణం లోని పాత ఫిషరీస్ కార్యాలయ స్థలం విషయంలో తమపై వచ్చిన ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ లక్ష్మణ్ అన్నారు.2022 సంవత్సరం లో పాత ఫిషరీస్ కార్యాలయం మార్చిన తర్వాత కార్యాలయ స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగిస్తూ అప్పటి అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ తమకు లీగల్ గా లెటర్ ఇచ్చారని తెలిపారు.అలాగే పాత ఫిషరీస్ కార్యాలయం అనుకొని వెనకాల ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉందన్నారు.సిద్దిపేట మున్సిపాలిటీకి కలెక్టర్ కార్యాలయం ద్వారా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు అప్పగించిన స్థలానికి ఫెన్సింగ్ కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేయించామని తెలిపారు.అయితే ఈ స్థలం వెనకాల ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది కుల సంఘాల పేరుతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.ఈ విషయంపై ఇప్పటికే ఎమ్మార్వో ఆర్డీవో కార్యాలయాలలో ఫిర్యాదు చేశామని….. స్థలంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.అయితే నిన్న తనతో పాటు ఓ కౌన్సిలర్ స్థలాన్ని కబ్జా చేస్తున్నట్టుగా కొన్ని వార్తాపత్రికలు వార్త ప్రచురించాయని….. అవి పూర్తిగా అవాస్తవాలని తెలిపారు.తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.గత 20 సంవత్సరాలు సిద్దిపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా చైర్మన్ గా పని చేశానని…… ఇప్పటివరకు అలాంటి ఆరోపణలు తనపై లేవని గుర్తు చేశారు.ఇప్పటికైనా తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారు మానుకోవాలని లేకపోతే చట్ట ప్రకారం వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.