10 ఏండ్ల ఉమ్మడి కోటగిరి మండల బీఅర్ఎస్ పార్టీ శని పోయింది.
కోటగిరి ఎంపీపీ పార్టీ మరాడంపై బాణసంచాలు పేల్చి సంబరాలు నిర్వహించిన బీఅర్ఎస్ నేతలు.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 24 ( లోకంతీరు ) : బీఅర్ఎస్ నుండి 10 ఏళ్ల పాటు అనేక ఉన్నత పదవులు చేపట్టి, పార్టీ అధిష్టానానికి ఏలాంటి సూచనలు, సంప్రదింపులు చేయకుండా ప్రజాభడ్డంగా ఎన్నికైన ఎంపీపీ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కోటగిరి ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్ ను ఉమ్మడి కోటగిరి మండల బీఅర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.శనివారం కోటగిరి మండల కేంద్రంలోనీ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉమ్మడి మండల బీఅర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు 10 ఏళ్ల బీఅర్ఎస్ పార్టీ శని పోయిందని నినాదాలు చేస్తూ బాణసంచాలు పేల్చి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా బీఅర్ఎస్ నేతలు మాట్లాడుతూ.పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో అనతి కాలంలోనే ఉన్నత పదవులు చేపట్టిన వల్లేపల్లి శ్రీనివాస్,పోచారం నమ్మకాన్ని వమ్ము చేశారని అన్నారు. ఆయన బీఅర్ఎస్ నాయకు లకు కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డికి గానీ ఏలాంటి సంప్రదింపు లు జరపకుండా పార్టీ ఫిరాయిం పులు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ప్యానెల్ పై గెలిచిన ఎంపీపీ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్నీ ఉమ్మడి కోటగిరి మండల ప్రజలు స్వాగతించడం లేదన్నా రు.గత 10 ఏళ్ల పాటు బీఅర్ఎస్ పార్టీలో ఉంటూ ఉన్నత పదవులు చేపట్టి ఇటీవల కాంగ్రెస్లోకి చేరడం పట్ల పార్టీలో నమ్మక ద్రోహం చేసే వారి శని పోయిందంటు నినా దాలు చేశారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు పోచారం శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు.కానీ కొందరు స్వార్థంతో స్వార్థ పూరిత రాజకీయాలను ప్రేరేపిస్తు బిఆర్ఎస్ పార్టీని నష్టం చేయాలని చూస్తున్నారనీ
.అలాంటి వారి ఆగడాలు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముందర సాగవన్నారు.అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తు గత 40 ఏళ్ళుగా ప్రజా సేవ చేస్తూన్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి నమ్మ క ద్రోహం చేస్తూన్న వారికి ఉమ్మడి మండల ప్రజలు త్వరలో తగిన బుద్ది చెబుతారని హెచ్చరించా రు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కోటగిరి మండల బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, జెడ్పిటిసి శంకర్ పటేల్,మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నీరడి గంగాధర్,సింగిల్ విండో చైర్మన్ కూచి సిద్దు,మాజీ వైస్ ఎంపీపీ శ్రీధర్ బాబు,ఉమ్మడి మండల ఎంపీటీ సీలు,మాజీ సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.