నూతన ప్రిన్సిపాల్ ని సన్మానించిన ఎన్ఎస్యుఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్ట్ 05 ( లోకంతీరు ) : భీంగల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఏడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న అబ్బా చిరంజీవి ఇటీవల బదిలీపై హైదరాబాద్ వెళ్లారు..వారి స్థానంలో నూతనంగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న జైపాల్ రెడ్డిని విద్యాశాఖ అధికారులు భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నియమించారు.. సోమవారం ఎన్ఎస్యుఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రహిమాన్ ఎన్ఎస్యుఐ సభ్యులు మర్యాదపూర్వకంగా నూతనంగా వచ్చిన ప్రిన్సిపాల్ ని కలిసి శాలువా పూలమాలతో సత్కరించారు..ఈ సందర్భంగా నిజాంబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షుడు రహిమాన్ మాట్లాడుతూ. గతంలో విధులు నిర్వహించిన ప్రిన్సిపల్ అబ్బా చిరంజీవి సేవలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ లెక్చరర్ కృష్ణ దాస్, అధ్యాపకులు జయానంద్ జాన్, రామ్ చందర్, శ్రీనివాస్ గౌడ్, క్రాంతి కృష్ణ, శ్రీకాంత్ అరుణ, శోభ , సత్యనారాయణ, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నాయకులు సయ్యద్ రహిల్, లక్ష్మణ్ చందు, ఈమాత్, రోమాన్, రామ్, సంతోష్ ,బన్నీ, హేమజా తదితరులు పాల్గొన్నారు.