Take a fresh look at your lifestyle.

పోలీస్ వారి హెచ్చరిక….భారీ వర్షాలు

0 1,431

భారీ వర్షాలు కారణంగా …పోలీస్ వారి హెచ్చరిక..

బాల్కొండ నియోజకవర్గం  , జులై 20 ( లోకంతీరు ) :వేల్పూర్ మండల ప్రజలందరికీ వేల్పూర్ పోలీసు వారి హెచ్చరిక రాబోయే 48 గంటల లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ వారు హెచ్చరించారు కావున వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లే ప్రమాదం ఉంది కావున …ప్రజలు ఏదయినా ప్రయాణాలు టూర్లు ముందే అనుకొని ఉంటే అట్టి ప్రయాణాలు 48 గంటలు వాయిదా వేసుకోండి,

అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుండి బయటకు రావొద్దు,
రోడ్ల పై నుండి వరద నీరు వెళ్లే ప్రమాదం ఉంది అలా వరద నీరు ప్రవహిస్తున్నపుడు ప్రజలు ఏమవుతుంది లే అని అట్టి రోడ్లు దాటితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కావున ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి రోడ్లు దాట రాదు,

లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి,

ప్రజలు వర్షం వల్ల ఏదయినా సమస్య వస్తే వెంటనే 100 నంబర్ కి కాని,

8712659862 ( ఎస్సై వేల్పూర్ ) నెంబర్ కి కాల్ చేయగలరు.

చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు, కరెంటు స్తంభాలు ముట్టుకోరాదు అని వేల్పూర్ ఎస్సై కే వినయ్ ఒక ప్రకటన లో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.