ఆదర్శ పాఠశాలలో భారీ తిమింగలాలు..?
• భారీగా లక్షల్లో నిధులు గోల్‌మాల్…?
• నిధుల అవకతవకలో పిన్సిపాల్ హస్తం..?
• విచారణ చేపట్టిన విద్యాధికారి

కామారెడ్డి జిల్లా / నిజాంసాగర్ , జూలై 05 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో లక్షలల్లో నిధుల పై అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి..? పాఠశాలకు మంజూరైన పీఎం శ్రీపతకంలో 360000/- పైచిలుకు, అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ లో రూ.16.లక్షల పైచిలుకు నిదులు కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిధులను అవకతవకలకు పాల్పడుతున్నా జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.?
ఒకేషనల్ లాబ్స్ ఫండ్స్ లో…?
స్కూల్ గ్రాంట్స్ లో తప్పుడు బిల్లులు పెట్టి ,సుమారు ప్రతిఏటా రూ. లక్షల్లో డబులు కాజేసినట్లు సమాచారం. ప్రతి సంవత్సరం పాత పుస్తకాలు అముతూ లెక్కలో చూపకుండా, ఇంటర్ ఎగ్జామ్స్ లో, అటెండర్ లేకున్న నలుగురు అటెండర్లను పెట్టినటుగా చూపించి బిల్లులు కాజేస్తున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. సైన్స్, మాథ్స్, స్పోర్ట్, సెల్ఫ్ డిఫెన్స్ ఫండ్ కొంతమంది ఉద్యోగులు ఖాతాలలోకి డబ్బులు మళ్ళించుకునన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా సరుకులు కొనుగోలు చేయనప్పటికి కొనుగోలు చేసినట్లు ఎల్లారెడ్డిలోని జనరల్ స్టోర్‌లో 30వేల రూపాయల చెక్కు ఇచ్చి తిరిగి అదే షాపు యజమాని నుండి అట్టి డబ్బులను ఒకరి ఖాతాలోకి మళ్ళించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పీఎం శ్రీ కిందా ఫీల్డ్ ట్రిప్ కి 3.65 లక్షల రూపాయల నిధులు, వస్తే కేవలం కేవలం ఖర్చు అయిన డబ్బులు 89 వేలు మాత్రమేనని, స్కూలు బస్సులు ఎల్లారెడ్డి నుండి తీసుకువెళ్ళి బిల్లులు మాత్రం ప్రైవేటు ట్రావెల్ బస్సులను మాట్లాడుకుని వెళ్ళినట్లు దానికి బిల్లులు 2 లక్షల పైచిలుకు కాజేశారని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.? మధ్యాహ్న భోజనం లో కూడా చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే విధంగా జరుగుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా అధికార యంత్రాంగం పట్టించుకోకపోగా,ప్రశ్నించిన అవుట్ సొర్చింగ్ ఎంప్లాయిస్ ని తీసేశారనే ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిధులు కాస్తున్న అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు,వారి తల్లితండ్రులు కోరుతున్నారు.
వెంటనే జిల్లా అధికారులు స్పందించి…!
నిదుల దుర్వినియోగానికి పాల్పడిన ఉద్యోగిపై చర్యలు తీసుకోవడంతో పాటు స్వాహా చేసిన నిధులను రికవరి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.విచారణ జరుగుతుంది నేను ఏం చెప్పలేను …?
ప్రిన్సిపల్ చంద్రకళ..
ఆదర్శ పాఠశాల లో జరిగిన అవినీతి అక్రమాలపై ఆ పాఠశాల ప్రిన్సిపల్ చంద్రకళ మాట్లాడుతూ తనపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని, విచారణ సమయంలో తాను ఏమి చెప్పలేనని ఆమె వివరణ ఇచ్చారు. త్వరలో ఏమి జరిగిందో మీరే తెలుసుకుంటారని ప్రిన్సిపల్ చంద్రకళ తెలిపారు.పై అధికారులకు నివేదిక పంపిస్తాం…?
మండల విద్యాధికారి దేవి సింగ్…!
ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్ పై వచ్చిన ఆరోపణలపై మండల విద్యాధికారి దేవి సింగ్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఆదర్శ పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్, సిబ్బందితో చర్చించారు, విచారణ చేస్తున్న సమయంలో మీడియాను లోనికి అనుమతి ఇవ్వలేదు. విచారణ అనంతరం విచారణలో ఏమి తేలిందని పత్రికా విలేకరులు, మండల విద్యాధికారి దేవి సింగ్ వివరణ కోరగా తాము విచారణ జరిపిన మాట వాస్తమని,పూర్తి వివరాలు సంబంధిత అధికారులకు నివేదిక అందిస్తామన్నారు. ఇట్టి విచారణ వెనుక మతలబు ఏమిటో అధికారులే గమనించాలి. అని ప్రజలలో అనుమానాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.