Take a fresh look at your lifestyle.

నేడు రామాయణ గ్రంథకర్త ఆతుకూరి మొల్ల జయంతి

0 1,415

నేడు రామాయణ గ్రంథకర్త ఆతుకూరి మొల్ల జయంతి

భీంగల్ ప్రతినిధి, మార్చ్ 12 ( లోకంతీరు ) : తెలుగులో మొల్ల రామాయణం గా ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని వ్రాసిన 16 వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ తెలుగు కవయిత్రి కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన ఆతుకూరి మొల్ల జయంతి ని పురస్కరించుకొని మంగళవారం భీంగల్ లో మీడియాతో ప్రముఖ కవి, రచయిత, కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కంకణాల రాజేశ్వర్ మా ట్లాడారు. శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన కవయిత్రి. మొల్ల రచనా శైలి సరళ మైందని, రమణీయ మైందని అన్నారు. మొల్ల కులా వంశ సంజాత. ఇంటిపేరు ఆతుకూరి వారు. కులాన్ని బట్టి కుమ్మరి మొల్ల అని వ్యవహరించబడుచున్నది. మొల్ల ఆజన్మ బ్రహ్మచారిణి. మొల్ల రామాయణం ఆరు కాండాలలో 871 పద్యాలతో కూడుకొని ఉంది. రామాయణ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతి. తనకు శాస్త్రీయమైన కవిత్వ జ్ఞానం లేదనీ, భగవద్ద త్తమైన ప్రసాదం వల్లనే కవిత్వం రాశానని మొల్ల పలు సందర్భాల్లో పేర్కొన్నదని కంకణాల రాజేశ్వర్ అన్నారు. 2017లో భారత ప్రభుత్వం మొల్ల జ్ఞాపకార్థం తపాలా బిళ్ళను విడుదల చేసిందనిపేర్కొన్నారు…

Leave A Reply

Your email address will not be published.