నూతన రాష్ట్ర గవర్నర్ తో తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ రాజ్ భవన్ లో సమావేశం



హైదరాబాద్, ఆగస్టు 14 ( లోకంతీరు ) : ఈరోజు నూతన గవర్నర్ మాన్యశ్రీ జిష్ణు దేవ్ వర్మ తో రాష్ట్ర పాలకమండలి మరియు జిల్లా చైర్మన్ ల సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర చైర్మన్ అజయ్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ గవర్నర్ సెక్రెటరీ బుర్ర వెంకటేశ్వర్లు భవాని శంకర్ సంయుక్త కార్యదర్శి ఓ ఎస్ రెడ్డి కోశాధికారి మరియు మన జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ మరియు వివిధ జిల్లాల చైర్మన్లు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సభ్యులను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ గారు రెడ్ క్రాస్ ఒక వానవియ్య మైన సంస్థ తెలంగాణ రెడ్ క్రాస్ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుని మనమందరం కలిసి తెలంగాణ రెడ్ క్రాస్ ని బలోపేతం చేసి మానవ సంబంధిత కార్యక్రమాలను చేపడదామని చెప్పారు మరియు మనం డ్రగ్స్ పై పోరాడాల్సిన అవసరం ఉందని యువతను విద్యార్థులను అప్రమత్తం చేయాల్సిన పని ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా పత్రులను విడుదల చేశారు.