మహిళలు అంటే అబల కాదు సబల..!
– దేశభివృద్ధికి మహిళలు వెన్నెముక లాంటివారు
– చాయ్ అమ్మే ఆడపడుచు కు సన్మానం
– న్యాయమూర్తి ఎస్ ఎన్. శ్రీదేవి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 12 ( లోకంతీరు ) : కుటుంబం సమాజంతో పాటు దేశాభివృద్ధి లో మహిళలు వెన్నెముక లాంటి వారని జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారిని పురుషులతో సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళ వారోత్సవాల్లో భాగంగా కోర్టు ఆవరణ సమీపంలో గత 20 ఏళ్లుగా టీ దుకాణం నిర్వహిస్తూ నలుగురి సంతానాన్ని పెంచి పోషించిన శారద అనే మహిళను జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు ఛైర్ పర్సన్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, కామారెడ్డి మంగళవారం సన్మానించారు. ఒంటరిగా ఉంటూనే ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా తన స్వశక్తితో కుటుంబ భాద్యతలను సక్రమంగా ముందుకు సాగిస్తున్న ఆమెను న్యాయమూర్తి అభినందించారు. ఆమెకు మరింత ధైర్యాన్ని కల్పించి బహుమతి ఇచ్చారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. సమాజంలో మహిళలపై వివక్ష అనేక అనర్థాలకు దారితీస్తుంది అన్నారు. ఉన్నత ఆలోచనలు, ఆరోగ్యవంతమైన సమాజం మహిళ ద్వారానే సాధ్యమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవ అధికార సంస్థ సూపరింటెండెంట్ వంచ చంద్రరెడ్డి, ఖాన్, శ్రావణ్, పోలీస్ లెసైన్ అధికారులు విట్టల్, హన్మండ్లు పాల్గొన్నారు.