బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి పరామర్శ

రామారెడ్డి, ఫిబ్రవరి 2 ( లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోతుల చిన్న బాపురెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం వారిని పరామర్శించారు. అలాగే రంగంపేట గ్రామ మాజీ సర్పంచ్ శ్యాంగౌడ్ కాలుకు ఆపరేషన్ కావడంతో పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు బాపురెడ్డికి ధైర్యం తెలిపారు. ఇటీవల గుండె జబ్బులు చాలా మందికి వస్తున్నాయి టైం కు మందులు వాడాలని సూచించారు. శ్యాంగౌడు వైద్యానికి అయిన ఖర్చులకు సంబంధించిన బిల్స్ అందేస్తే ఎంపీ బీబీ పాటిల్ తో మాట్లాడి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అదేవిధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు సూచించారు. వీరి వెంట కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ యూత్ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, గిరిజన నాయకుడు లింబాద్రి నాయక్ , బీయారెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతుల లింగారెడ్డి మాజీ ఉపసర్పంచ్ రవి గంగాధర్, సంజీవరెడ్డి బాలరాజ్ పోతుల కృష్ణారెడ్డి పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.