మోర్తాడ్ లొ ఘనంగా రుణమాఫి సంబరాలు.
- ముత్యాల సునీల్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్

బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి, జులై 18 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న రుణమాఫి కార్యక్రమ ప్రారంభోత్సవ వేడుకలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. వెయ్యి మంది రైతులు, కాంగ్రెస్ పార్టి ప్రజా ప్రతినిధులు,నాయకులు కార్యకర్తలతో మోర్తాడ్ బస్టాండ్ నుండి రైతు భవనం వద్దకు ర్యాలీగా వెళ్ళారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. రైతు భవనం వద్ద ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లొ రైతులతో కలసి పాల్గొన్నారు.
కార్యక్రమ అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రుణమాఫి ఇప్పటివరకు దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసం చేసి గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలుv చేసినా ఒక్కొక్కటిగా సరిద్దిద్దుకుంటూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫి చేయడానికి సిద్ధమయ్యారని ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల గుండెల్లో చిరకాలం నిలిచి పోతుందని అన్నారు. ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫి చేస్తామని చెప్పామని ఇచ్చినా మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టికి అలవాటు అని అన్నారు.
మొదటి దశలో నియోజకవర్గంలో 7600 మంది లక్షలోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ జరుగుతుందని అన్నారు.
ఈనెల ఆఖరికి 1,50,000 రూపాయల వరకు రుణమాఫి ఆగష్టు 15 లోపు 2 లక్షల రుణమాఫి జరుగుతుందని అన్నారు. ప్రతీ కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫి జరుగుతుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణవిముక్తి చెయడమే కాకుండా రానున్న రోజుల్లో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉంటారని వ్యవసాయం పండగ అవుతుందని అన్నారు.కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.