కార్పొరేషన్ల ఏర్పాటు స్వాగతిస్తున్నాం

కామారెడ్డి జిల్లా , మార్చి 14 ( లోకంతీరు ) : మంత్రి మండలి సమావేశం లో బీసీ కులాలకు16 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి మండలికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆర్థికంగా వెనకబడిన బీసీలకు, మాదిగ, మాదిగ ఉప కులాల, మాల, మాల ఉప కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం సంతోషం అని అందుకు మంత్రి మండలిని అభినందిస్తున్నామని అన్నారు. గిరిజనుల కోసం మూడు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాదు వాటికి చైర్మన్ లని బీసీ కార్పొరేషన్లకు బీసీలను, ఎస్సీ కార్పొరేషన్ లకు ఎస్సీలను, ఎస్టీ కార్పొరేషన్ లకు ఎస్టీలను నియామకం చేస్తే బాగుంటుంది. బీసీ కులాలకు రెడ్డిల నో, రావులను చైర్మన్ లను చేస్తే వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాదు వాటికి తగిన నిధులను సమకూర్చాలని, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వంగా ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కుల గణన చేపట్టి బీసీలకు తగు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు. దాంట్లో బీసీలకు సబ్ కోటా పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
బీసీ కులాల్లో వెనకబడిన చాలా కులాలు ఉన్నాయనీ, వాటికి కార్పొరేషన్లు అవసరం ఎంతైనా ఉందనీ, వారికి ప్రాధాన్యత కల్పించి వారికి కూడా కార్పొరేషన్లను ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుతున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే వారికి తగిన వనరులను సమకూర్చాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. గత ప్రభుత్వంలో ఎంబీసీ కార్పొరేషన్ 1000 కోట్లు కేటాయించిన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదన్నారు. ఏదో నామ్కే వాస్తే బీసీలకు ఎక్కడో ఒకరికి లక్ష రూపాయల బీసీ బందు ఇచ్చి చేతులు దులుపుకున్నది. గత ప్రభుత్వం లాగా కాకుండా బీసీలను కడుపులో పెట్టి చూసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తున్నామనీ ప్రకటనలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించి బీసీల కు న్యాయం చేయాలనీ, ఈ ప్రజా ప్రభుత్వంలో బీసీలకు తగు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం, బీసీలు ఉత్పత్తి సేవ రంగాల్లో రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో కొన్ని పేద కుటుంబాలు ఉన్నాయనీ వాటిని ప్రభుత్వం ఆదుకోవాలనీ ప్రకటనలో పేర్కొన్నారు.