Take a fresh look at your lifestyle.

విద్యార్థినిని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లిన టీచర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి….

0 1,141

విద్యార్థినిని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లిన టీచర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి

– PDSU డిమాండ్.

నిజామాబాద్, నవంబర్ 02 ( లోకంతీరు )  : మాక్లూర్ కేజీబీవీలో 6వ తరగతి చదువుతున్న సహస్ర అనే దళిత విద్యార్థినిని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లిన టీచర్ గౌతమి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో డిఇఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ కె. నాగజ్యోతి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ మాక్లూర్ కేజీబీవీలో సోషల్ సీఆర్టీీగా పనిచేస్తున్న గౌతమిరెడ్డి తన బంగారు గొలుసు పోయిందని సహస్ర అనే 6వ తరగతి విద్యార్థినిని నిజామాబాద్, మాలపల్లిలో గల ఫకీరు దగ్గరికి తీసుకు వెళ్లి మంత్రాలు (అంజనం) చేయించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ భావజాలాన్ని పెంచాల్సిన టీచర్లే, ఇలా మూఢనమ్మకాలను ఆశ్రయించడం దారుణమన్నారు. ఈ ఘటనపై అన్ని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో కథనాలు వచ్చాయన్నారు.అయినప్పటికీ ఈ ఘటనకు ప్రధాన బాధ్యురాలైన సీఆర్టీ గౌతమిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు.ఈ జాప్యానికి ఒక ఉపాధ్యాయ సంఘం నేత, ఎస్.ఎస్.ఏ అధికారిణిల పైరవీలే కారణమని ఆరోపించారు. తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా పైరవీలతో దోషులను కాపాడే కుట్రలు చేస్తే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.ఈ ఘటనకు బాధ్యులైన టీచర్ గౌతమిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిచో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఇలాంటి మూఢనమ్మకాలను, అశాస్త్రీయ భావజాలాన్ని, దుర్ఘటనలను నియంత్రించాలని, సైన్సు, శాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించేలా జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలలో తగు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు రమేష్, సతీష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.