ఫిర్యాదు బాక్సుల ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి

కామారెడ్డి ప్రతినిధి,ఆగస్టు 31 ( లోకంతీరు ) : కామారెడ్డి ఎమ్మెల్యే ఫిర్యాదుల బాక్స్ ల ద్వారా వచ్చిన అర్జీ లను వెంటనే పరిష్కారం చేయాలనీ తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన బీజేపీ నాయకులు శనివారం పిర్యాదులు పరిష్కరించాలని తహసీల్దార్ లకు ఎమ్మెల్యే తరుపున దరఖాస్తులు అందజేసిన బీజేపీ నాయకులు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ప్రజలకు ఇబ్బందులు ఉంటే నేరుగా తనకే సంప్రదిస్తే పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఫిర్యాదుల పెట్టేను ఏర్పాటు చేశారని అందులో వచ్చిన వ్యక్తిగత సమస్యలు, విద్య, వైద్యం కి సంబంధించిన సమస్యలు తన పరిధిలో పరిష్కారానికి కృషి చేస్తున్నారని, అందులో భాగంగా వచ్చిన ఫిర్యాదుల్లో రెవెన్యూ, రేషన్ కార్డులకు సంబంధించిన పిర్యాదులను తహసీల్దార్ వీటి పరిష్కారం విషయంలో అధికారులు ఎమ్మెల్యే వివరణ ఇస్తారని అన్నారు.మండలానికి సంబంధించి తహసీల్దార్ కీ 6 పిర్యాదులు అందించడం జరిగిందని, నియోజకవర్గ ప్రజలు ఏ సమస్య ఉన్నా పిర్యాదుల పెట్టెలో వేస్తే నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి 42 వార్డ్ కౌన్సిలర్ పండ్ల ప్రవీణ్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి,రామారెడ్డి మండల ఇంచార్జి రాజశేఖర్, అన్నారం అధ్యక్షులు పిప్పర నరేష్,మద్దికుంట అధ్యక్షులు ముత్యాల రాజు,జిల్లా.ఎస్టీ ప్రధాన కార్యదర్శి రంజిత్ రాథోడ్ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.