Take a fresh look at your lifestyle.

రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలి….

0 1,378

రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలి

  • ఏ.ఓ. మహేందర్ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 22 ( లోకంతీరు ) : బాల్కొండ మండలంలోని అన్ని గ్రామాల రైతులు అనగా ఈ సంవత్సరం నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు మరియు ఇది వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులు రైతు బీమాకు సంబంధిత ఏఈఓ వద్ద దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు , నిబంధనలు

18 నుండి 59 సంవత్సరాల లోపు వయస్సు ఉండి అర్హత కలిగిన రైతులు దరఖాస్తులు చేసుకోవాలి ,గత సంవత్సరం ఆగస్టు నుండి ఈ సంవత్సరం తేదీ 28.జూన్.2024 వరకు కొత్తగా పట్టా పాసు బుక్కు పొందిన రైతులు రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలుపాలి, అలాగే గతంలో పట్టాదారు పాసు బుక్కు పొంది ఇప్పటివరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకొని రైతులు మరియు నామిని వివరాలు ఏమైనా మార్పులు ఉంటే కూడా సంబంధిత ఏఈఓ ని కలిసి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి, తప్పనిసరిగా పట్టాదారు రైతు స్వయంగా ఏఈఓ వద్దకు వచ్చి దరఖాస్తు ఇవ్వాలి, రైతు బీమా దరఖాస్తుకు కావలసినవి,

• బీమా అప్లికేషన్ ఫారం

• పట్టా పాస్బుక్ జిరాక్స్

•  రైతు ఆధార్ కార్డు జిరాక్స్

•  నామిని ఆధార్ కార్డు జిరాక్స్.

Leave A Reply

Your email address will not be published.