మంజీరా ను తెగ తోడేస్తున్న ఇసుకసురులు..?
• అడ్డు అదుపు లేకుండా అక్రమ ఇసుక రవాణా
• చూసిచూడన్నట్లు వ్యవహరిస్తున్న అధికారులు
• జిల్లా కొత్త పాలనాధికారితోనైనా వ్యవహారం గట్టెక్కేనా…?


కామారెడ్డి జిల్లా / బిచ్కుంద, జూలై 06 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలో ఇసుక రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పట్టపగలే అక్రమంగా ఇసుకరవాణా చేస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. అధికారుల కళ్లెదుటే ఆ దందా సాగుతున్నా కళ్లకు కట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వందలాది లారీలు పరిమితికి మించి బరువుతో రోడ్లపై పరుగులు తీస్తుండడంతో రోడ్లు దెబ్బతింటున్న అధికారులకు పట్టడం లేదు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై
లోకంతీరు న్యూస్ ప్రత్యేక కథనం…..!
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని హస్గుల్, ఖద్గాం ఇసుక క్వారీల నుంచి వే బిలులు లేకుండా జోరుగా అక్రమ ఇసుక రవాణా సాగుతుంది. అయినా అధికారులు ఇవేమి పట్టించుకోకపోవడం గమనార్హ:. దీనికి తోడు ఓవర్ లోడ్ లతో వాహనాలు వెల్లడంతో పలు చోట్ల లారీలు దిగబడుతున్నాయి. పరిమితికి మించి బరువుతో రోడ్లపై ఇసుక తరలిస్తుండటంతో రహదారులు దెబ్బతింటున్నాయి. హస్గుల్, కుర్లా, ఖత్గావ్ గ్రామ సమీపంలోని మంజీరా నుంచి నిత్యం వందలాది లారీల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. భారీ ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న అటు వైపు నాయకులు గాని, అధికారులు గాని కన్నెతి చూడటం లేదు. మా ఇసుక దందాను ఎవరూ ఆపలేరంటూ బహిరంగంగా విమర్శలు చేయడం పట్ల అధికారుల సహాయ సహకారాలు ఏ విధంగా వారికి అందుతున్నాయో మనకు అర్థం అవుతుంది.వే బిల్లులు ఉన్న వాటికి ఆలస్యం..? అక్రమ ఇసుక రవాణా దారులు క్వారీలలో వే బిల్లులతో వచ్చే లారీలను ఒకటి, రెండు రోజులు ఆపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దానికి తోడు జీరో వే బిల్లులతో భారీగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాపై అధికారులు దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.