Take a fresh look at your lifestyle.

బొగ్గు నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి.

0 33

                                                                                                                                       బొగ్గు నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి.
అర్జీటూ ఏరియా సీహెచ్‌పీ సందర్శన.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, మే 29: బొగ్గు నాణ్యత ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు రవాణా ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి అధికారులకు సూచించారు. గురువారం ఆర్జీ-2 ఏరియాలోని సీహెచ్‌పీని సందర్శించిన సీఎండీ బొగ్గు రవాణా, నాణ్యత నిర్వహణపై అధికారులు, ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బొగ్గు నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వినియోగదారులకు మెరుగైన నాణ్యత గల బొగ్గు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న కొత్త సీహెచ్‌పీ బంకర్ పనులను స్వయంగా పరిశీలించారు. బంకర్ సామర్థ్యం, అక్కడి నుంచి బొగ్గు రవాణా విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారుల వివరాల ప్రకారం, అధునాతన సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ సీహెచ్‌పీ అక్టోబర్-2026 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సాంకేతికత ద్వారా క్రషింగ్ అయ్యే బొగ్గు నాణ్యత మరింత మెరుగుపడటంతో పాటు, టన్నుకు సుమారు రూ.30 వరకు సంస్థకు ఆదా అయ్యే అవకాశముందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, ఎం.తిరుమలరావు, ఈడీ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జీఎం (కోఆర్డినేషన్ & మార్కెటింగ్) టి. శ్రీనివాస్, ఆర్జీ-2 జీఎం బండి వెంకటయ్య, హెచ్‌పీ ఇంజనీర్ నీరటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.