Take a fresh look at your lifestyle.

రాష్ట్రస్థాయి మహిళా డిగ్రీ కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలు…

0 1,711

రాష్ట్రస్థాయి మహిళా డిగ్రీ కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) :  కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలోని
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల నందు రెండో రోజు కొనసాగిన రాష్ట్రస్థాయి మహిళా డిగ్రీ కళాశాల సంస్కృతిక ప్రదర్శనలు.తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల (మర్కల్ )కామారెడ్డి నందు స్టేట్ లెవెల్ వైబ్రేషన్(కల్చరల్ ఫెస్ట్ ) రెండవ రోజు కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా కళాశాల పూర్వ విద్యార్థిని ఎవరెస్ట్ శిఖరం అధిరోహిని మాలవత్ పూర్ణ, ఎమ్. ఎల్. సి. కూర రఘూత్తమ రెడ్డి ,జాయింట్ సెక్రటరీ డాక్టర్ జి. నిరూప, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ యశోలత , కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు మర్కల్ గ్రామ మాజీ సర్పంచ్ సంగారెడ్డి,విచ్చేయడం జరిగింది. విద్యార్థులు ఎలా కష్టపడి ఎదగాలి, తల్లిదండ్రులు మరియు గురువుల ఆశయలను ఎలా తీర్చాలి, వారిని ఎలా సంతోష పరచాలనేది విద్యార్థులకు తెలియ జేశారు. తర్వాత 24 రకాల సాంస్కృతిక విద్యా సంబంధ ప్రదర్శనల్లో 30 డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మొత్తం 24 విభాగాలలో విజేతలకు కళాశాల కు వచ్చిన అతిథులు,ప్రథమ, ధ్వితీయ , తృతీయ నగదు బహుమతులను అందజేయడం జరిగింది.9 రకాల పోటీల్లో విజేతలు గా నిలిచి, కామారెడ్డి రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను సాధించిన కళాశాల గా నిలిచింది.అతిథులందరిని ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. రాధిక మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తమ తొడ్పాటును అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో రీజినల్ కో ఆర్డినేటర్ కే. అలివేలు
సాంఘిక  సంక్షేమ గురుకుల పాఠశాల ల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు,30డిగ్రీ కళాశాల ల అధ్యాపకులు కామారెడ్డి కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.