Take a fresh look at your lifestyle.

కార్మికుల సమస్యల పరిష్కారమే ఏఐటీయూసీ లక్ష్యం: కొరిమి రాజ్ కుమార్.

0 2

కార్మికుల సమస్యల పరిష్కారమే ఏఐటీయూసీ లక్ష్యం: కొరిమి రాజ్ కుమార్.
ఆర్‌ఎల్‌సీ సమక్షంలో పలు డిమాండ్లపై యాజమాన్యంతో ఒప్పందాలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భూపాలపల్లి, ఆగస్టు 31: కార్మికులకు ఏ కష్టం వచ్చినా ముందుండి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ  కొరిమి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం కేటీకే-1 ఇంక్లైన్‌లో నిర్వహించిన ఏఐటీయూసీ గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ప్రాంతీయ కార్మిక కమిషనర్ సమక్షంలో సింగరేణి యాజమాన్యంతో జరిగిన చర్చల్లో సమ్మె నోటీసులో పేర్కొన్న పలు కార్మికుల డిమాండ్లను యాజమాన్యం అంగీకరించి ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. ఒప్పందంలోని ముఖ్యాంశాలను వివరిస్తూ కార్మికుల పెర్క్స్‌పై చెల్లించాల్సిన ఆదాయపు పన్నును యాజమాన్యమే చెల్లించేందుకు అంగీకరించిందన్నారు. కార్మికులు సొంత ఇళ్లు నిర్మించుకునే అంశంపై అధ్యయనం చేసి రెండు నెలల్లో నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2016-17 జేఎంఈటీలకు ఖాళీల ఆధారంగా కాకుండా ఓవర్‌మ్యాన్ పదోన్నతులు కల్పించేందుకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆరు పేర్ల సమస్యను పరిష్కరించేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవించిన కార్మికుల కుటుంబాలకు బ్యాంకు, కంపెనీ ద్వారా మొత్తం రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించేలా ఒప్పందం జరిగిందన్నారు. 149 మంది డిపెండెంట్లకు డిపెండెంట్ కార్యాలయ ఉత్తర్వులు జారీ చేసేందుకు, కార్మికుల రక్షణ కార్యక్రమాలను త్వరితగతిన అమలు చేసేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. మెడికల్ బోర్డు ద్వారా ఉపరితల విధులకు సరిపోతారని నిర్ధారించిన మైనింగ్ సిబ్బంది, టెక్నీషియన్లు, సూపర్‌వైజర్లకు తగిన ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందాలపై కొన్ని ఇతర కార్మిక సంఘాలు అపోహలు ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మవద్దని రాజ్ కుమార్ సూచించారు. ఏఐటీయూసీ కార్మికులను సొంత అన్నదమ్ములుగా భావిస్తూ వారి హక్కుల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చంద్రమౌళి, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రెటరీ సుధాకర్ రెడ్డి, ఏఐటీయూసీ అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ అహ్మద్, మైన్స్ కమిటీ సభ్యులు శివ, నవీన్, షిఫ్ట్ ఇంచార్జీలు దేవ, సాంబ, శ్రీనివాస్, వసంత్, టెంపుల్ కమిటీ సభ్యులు నర్సయ్య, సేఫ్టీ కమిటీ సభ్యులు రాజేశం, రాజయ్య, సురేష్, క్యాంటీన్ కమిటీ సభ్యులు అశోక్, ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు, మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.