డాక్టరేట్ గ్రహీతకు దళిత నాయకుల ఆత్మీయ సత్కారం
- నాగయ్యకు డాక్టరేట్ ప్రదానం చేసిన మెక్సికో యూనివర్సిటీ.
- అంబేద్కర్ భావజాల వ్యాప్తికి ఆయనకు అరుదైన గౌరవం.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 19 ( లోకంతీరు ) :సమాజంలో నిరుపేద పిల్లలకు చదువుమీద అవగాహన కల్పించడం,దళిత పిల్లలకు చదువు యొక్క ప్రాముఖ్యతను తెలిపి వారిని ప్రోత్సహించడం,గ్రామ గ్రామానా భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్,బాబు జగ్జీవన్ రాయ్ భావజాలలను విశృత పరచడం,వారి వ్విగ్రహాల ఏర్పాటుకు స్వచ్చందంగా ముందు వరుసలో ఉన్న గొప్ప సంఘసంస్కర్త పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగయ్యకు అమెరికాలోని తలాసా,మెక్సికో యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేశారు.బాన్సువాడ నియోజక వర్గం పోతంగల్ మండలం లోని కొడ్చర్ల గ్రామానికి చెందిన నాగయ్యకు పలు కులసంఘల ప్రతినిధులు నుండి అరుదైన ఆత్మీయ సత్కారం అందుతోంది. ఇటీవల ఈ అవార్డును ఆయన నిజామాబాద్ నగరంలోనీ రాయల్ ప్యాలెస్ నందు సంభదిత యూనివర్సిటీ సభ్యులు డాక్టరేట్ పట్టాను అందజేయడంపై ఉమ్మడి కోటగిరి మండల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా సోమవారం పోతంగల్ మండలం లోని చెకపోస్ట్ వద్ద డాక్టరేట్ నాగయ్యకు శాలువాతో సత్కరించి ఆత్మీయ అభినందనలు తెలియజేశారు.ఈ ఆత్మీయ సన్మనంలో ఉమ్మడి కోటగిరి మండల మాల మహానాడు అధ్యక్షులు మీర్జాపూర్ సాయన్న, ఎం.ఆర్.పి.ఎస్ బాన్సువాడ నియోజక వర్గ నాయకులు పి.లాలయ్య,అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు పి.సైదయ్య, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు బ్యాగరి రాములు, నాయకులు పాల గంగారం,వాగ్మరే రాము,జంగం సాయిలు,హంగర్గ ఫారం బాబూ,తదితరులు ఉన్నారు.