Take a fresh look at your lifestyle.

పాల్వంచలో కార్మిక నేత ముత్యాల కోటేశ్వరరావు మృతి : కొత్వాల సంతాపం.

0 2

పాల్వంచలో కార్మిక నేత ముత్యాల కోటేశ్వరరావు మృతి.
డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు సంతాపం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పాల్వంచ, సెప్టెంబర్‌ 2: పాతపాల్వంచ షిర్డీ సాయిబాబా దేవాలయ ధర్మకర్త, కేటీపీఎస్‌లో ఫోర్‌మెన్‌, 327 యూనియన్‌ నాయకుడు ముత్యాల కోటేశ్వరరావు అనారోగ్యంతో బుధవారం ఉదయం మృతి చెందారు. పాతపాల్వంచలోని ఆయన స్వగృహంలో ఉంచిన భౌతికకాయానికి డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌, మార్క్‌ఫెడ్‌ మాజీ డైరెక్టర్‌, పాల్వంచ కో-ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు, ఆయన సతీమణి, కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ కొత్వాల విమలాదేవి, భద్రాద్రి జిల్లా ఐక్య తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు లోగాని శ్రీనివాస్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేటీపీఎస్‌ కార్మిక నాయకుడు సాదం రామకృష్ణ ఆధ్వర్యంలో కోటేశ్వరరావు భౌతికకాయంపై యూనియన్‌ జెండాను కప్పి తోటి కార్మికులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో కార్మికులు, భక్త బృందాలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. కోటేశ్వరరావు మృతి పట్ల కొత్వాల శ్రీనివాసరావు తదితరులు ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.