తాగునీరు -వర్షపునీటి సంరక్షణ కార్యక్రమం

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 06 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛధనం-పచ్చధనం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున ‘తాగునీరు-వర్షపునీటి’ సంరక్షణపై పలు కార్యక్రమాలు చేపట్టినట్లు ఎంపీడీవో మహమ్మద్ ముజాఫరోద్దీన్, ఎంపీవో యం.డి.గౌస్ మోహిమోద్దీన్ లు తెలిపారు. ముప్కాల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని కొత్తపల్లి, వేంపల్లి, నాగంపేట్, నల్లూర్, వెంచిర్యాల, రెంజర్ల గ్రామాల్లో ‘తాగునీరు-వర్షపునీటి’ సంరక్షణపై కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.