రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి
– వనమాల కృష్ణ CPI (ML)మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి డిమాండ్

నిజామాబాద్, ఆగస్టు 08 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కమిటీ CPI (ML) మాస్ లైన్ ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో ప్రజా పంథా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (A.O) గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్.) మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ,
రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు,తదితర అనేక సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజలు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారన్నారు. కెసిఆర్ నిరంకుశ పాలన వలన ప్రజలు గద్దెదించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తన మ్యనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగిందని, వాటన్నింటిని అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు, ఇతర అసంఘటిత, కాంట్రాక్టు కార్మికులకు సెలవులతో కూడిన కనీస వేతనాలను అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ ఆరోగ్య శ్రీ బకాయిలు వెంటనే చెల్లించి విద్యార్థులకు ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. నిరుద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం ప్రకటించి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా చేయూత పెన్షన్ల కింద 2016/- నుండి 4000/- రూపాయలకు పెంచి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న బీడీ కార్మికులందరికీ 4000/- రూపాయలు పెన్షన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ మాట్లాడుతూ,రైతాంగ రుణాలను రద్దు చేసి కొత్త రుణాలు ఇచ్చి పంటల బీమా పథకం అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ధరణి సమస్యలు పరిష్కరించాలని వాస్తవ సాగుదారులందరికీ రైతు భరోసా అందించి కౌలు రైతుల గుర్తింపునకు నిర్దిష్ట చర్యలు చేపట్టాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా)పార్టీ రాష్ట్ర నాయకులు మిద్దె నరేందర్, పిట్ల రామకృష్ణ, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం. వెంకన్న, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి. దేవారం, బోధన్ డివిజన్ కార్యదర్శి డి. రాజేశ్వర్,జిల్లా నాయకులు సారా సురేష్,గంగాధర్,కే.రాజేశ్వర్ ,సాయగౌడ్, సాయి రెడ్డి, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి సంధ్యరాణి,మురళీ, పి.వై.ఎల్. జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.