Take a fresh look at your lifestyle.

నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్.

0 2

నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 5: తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ శనివారం జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో పలు పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిట్యాల మండలంలోని తిరుమలపూర్ గ్రామంలో గోపగాని అక్కమ్మ దశదినకర్మకు హాజరై కుటుంబీకులను పరామర్శించారు. ప్రమాదానికి గురైన గోపగాని ప్రభాకర్‌ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కటకం నరసయ్య, బావుసింగ్‌పల్లికి చెందిన పసుపుల మొగిలయ్య, పొనగల్లుకి చెందిన యాపచెట్టి సాంబయ్య మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మొగుళ్లపల్లి మండలం లోనీ మేదరిమెట్ల గ్రామంలో ఇటీవల మృతి చెందిన కట్ల రాములు కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సాయంగా 25 కేజీల బియ్యాన్ని అందించారు. ప్రజల సుఖదుఃఖాల్లో, ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు టీఆర్పీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రవి పటేల్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో సాదు మల్లన్న ముదిరాజ్, టీఆర్పీ నాయకులు పిట్టల రాంబాబు, వైద్య లక్ష్మణ్, కుమార్, నిరంజన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.