సింగరేణి లాభాల వాటాపై ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో విజయోత్సవాలు.
భూపాలపల్లిలో నేడు సాయంత్రం 5 గంటలకు సంబరాలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 13: సింగరేణి కార్మికులకు 34 శాతం లాభాల వాటా కింద రూ.596.36 కోట్ల పంపిణీ జరిగిన సందర్భంగా భూపాలపల్లిలో బుధవారం విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు ఐఎన్టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భేతెల్లి మధూకర రెడ్డి తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, జేబీసీసీఐ-11 స్టాండర్డైజేషన్ కమిటీ సభ్యుడు డాక్టర్ బి. జనక్ ప్రసాద్ కృషి ఫలితంగా కార్మికులకు లాభాల వాటా పంపిణీ జరిగిందని పేర్కొన్నారు. ఈ విజయోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం 5 గంటలకు భూపాలపల్లి ఏరియాలోని స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ రాష్ట్ర, కేంద్ర కమిటీ నాయకులు, మహిళా విభాగం అధ్యక్షురాలు, బ్రాంచ్ కమిటీ నాయకులు, మహిళా విభాగం బ్రాంచ్ ఉపాధ్యక్షురాలు, యువజన విభాగం అధ్యక్షులు, సీనియర్ ఐఎన్టీయూసీ నాయకులు, మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జి, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు, మైనింగ్ స్టాఫ్ సిబ్బంది, అన్ని గనుల విభాగాల పిట్ కార్యదర్శులు, యువ నాయకులు, ఐఎన్టీయూసీ కార్యకర్తలు, సింగరేణి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.