Take a fresh look at your lifestyle.

రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్న యువ జంట…

0 1,092

రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్న యువ జంట

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 27 ( లోకంతీరు ) : కామారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం యువ జంట పెళ్లి చేసుకుని పూలదండలు మార్చుకున్నారు. అనంతరం సబ్ రిజిస్టార్ కృష్ణ దంపతులకు పెళ్లి సర్టిఫికెట్ అందజేశారు. రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సుంకరి శ్రీకాంత్ వయస్సు 24, కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మండల భాగ్యలక్ష్మి వయస్సు 23 వీరు ఇరువురు గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో పడ్డారు. అనంతరం తలమడ్ల మాజీ ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సాక్షుల ఆధ్వర్యంలో పెళ్లి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము ప్రయివేటు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.