Take a fresh look at your lifestyle.

జీపీ కార్మికుల వేతన సమస్యలను వెంటనే పరిష్కరించాలి….

0 1,272

జీపీ కార్మికుల వేతన సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

• IFTU డిమాండ్

నిజామాబాద్ నియోజకవర్గం, జులై 05 ( లోకంతీరు ) : గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ రాష్ట్ర కమిటీ లో భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించిన జరిగింది. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (IFTU) జిల్లా అధ్యక్షులు ఎం.వెంకన్న మాట్లాడుతూ…
గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందన్నారు. నెలల తరబడి వేతనాలు రావడం లేదన్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ కార్మికులకు జీఓ నెం. 60 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రతినెల 5వ తేదీలో వేతనాలు ఇవ్వాలన్నారు. మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలన్నారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలన్నారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని, గ్రామపంచాయతీ కార్మికులను సిబ్బందిని పర్మినెంట్ చేయాలన్నారు.
ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో IFTU జిల్లా అధ్యక్షులు ఎం.ముత్తన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు డి.రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేష్,

జిల్లా నాయకులు మురళి, సాయిరెడ్డి, గ్రామపంచాయతీ కార్మికులు సాయిలు, రాజేందర్, సుశీల, రమేష్, సాయిలు, లక్ష్మి, పోసాని, చిన్నయ్య, దేవన్న గంగాధర్,lపాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.