Take a fresh look at your lifestyle.

ఆధార్ సెంటర్ ల నిర్వాహకుల ఇష్టారాజ్యం….

0 1,799

ఆధార్ సెంటర్ ల నిర్వాహకుల ఇష్టారాజ్యం….

. సామాన్యులకు తప్పని కష్టం……..

. జోరుగా వసూళ్లు…

 

నిజామాబాద్, జనవరి 22 (లోకంతీరు): నిజామాబాద్ నగరంలోని ఆధార్ సెంటర్లు ప్రతి రోజు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ఆధార్ సెంటర్లు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదే చనువుగా భావించిన ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ఒక్కొక్క ఆధార్ కార్డుకు 200 నుండి 3000 వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డులో ఏ మాత్రం లోపల ఉన్న 1000 రూపాయలు చెల్లించాలని కొందరు చెబుతున్నారని వారి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. పేరు మార్పు , అడ్డ్రస్ మార్పు కోసం సుమారు 5000 వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. నగరం లోని ఆధార్ సెంటర్ల నిర్వాహకులు రోజురోజుకు సామాన్య ప్రజలపై భారము మోపకుండా కేవలం ప్రభుత్వం కు ఎంత చెల్లించలో అంతే తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. పేరు మార్పు ఉన్న,అడ్డ్రస్ మార్పులు ఉన్న ఆధార్ సెంటర్లలో దేనికెంత అని బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఒక ఆధార్ కార్డు ఒక 500 నుండి 3000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సుమారు ఒకరోజు ఒక సెంటర్లో 100 ఆధార్ కార్డులో నమోదు చేస్తే… అంటే వారి సంపాదన ప్రతిరోజు వేలకు మించి పోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆధార సెంటర్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకొని సామాన్య ప్రజలపై భారం పడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.