Take a fresh look at your lifestyle.

నేటి నుండి 14 వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్…..

0 1,857

నేటి నుండి 14 వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహణ

– జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : పచ్చదనం-పరిశుభ్రతతో పరిఢవిల్లిననాడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలుగుతామని, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నేటి నుండి ఈ నెల 14 వరకు చేపడుతున్న స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా దోమకొండ మండల కేంద్రంలో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార చేతబట్టి పరిసరాలను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు. దగ్గరుండి మురుగు కాలువలను శుభ్రం చేయించారు. ఈ ;సందర్భంగా మాట్లాడుతూ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేసి పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. గ్రామం మాది అనే భావనతో రోడ్ల వెంట వెంట చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, ఇరువైపులా నీడనిచ్చే, అందమైన పూల మొక్కలు ఉండేలా చూడాలన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్నో అనర్థాలు సంభవిస్తాయన వాటి వాడకాన్ని పూర్తిగా నిరోధించాలని అవగాహన కలిగించారు.మన సృజనాత్మకతకు పదను పెట్టి నిరుపయోగమైన ప్లాస్టిక్ బాటిల్స్, తదితర వాటితో ఆకర్షనీయంగా అలంకరణ వస్తువులు, తయారు చేయాలని సూచించారు. అనంతరం జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా బాలికల టాయిలెట్స్ బయటికేస్ కనబడకుండా ప్రహారి గోడ నిర్మించాలని ఉపాధ్యాయులు, గ్రామస్థులు కోరగా తక్షణ పరిష్కార నిమిత్తం గ్రీన్ షెడ్ నెట్ ఏర్పాటు చేయించగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిన పెట్టి మురుగు కాలువలు శుభ్రం , తడి , పొడి చెత్తను వేరుగా సేకరించి రీసైక్లింగ్ చేయడం, .ప్రాథమిక అవసరాలైన త్రాగునీరు సమస్య రాకుండా పైపుల లీకేజీలను సరి చేసుకుంటూ క్రమం తప్పకుండా త్రాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని, మాసంలో మూడు సార్లు మంచినీరు వనరులను క్లోరినేషన్ చేయాలని, . ఫ్లో కంట్రోల్ వాల్ ఉండేలా, మోటార్ల ద్వారా అక్రమంగా నీటిని పొందడం అరికట్టాలని అధికారులకు సూచించారు. పల్లె ప్రగతి లో భాగంగా పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోజ్ షెడ్డుల నిర్వహణపై కూడా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ తెలిపారు. ఆదాయ వరులను సమకూర్చుకునేందుకు ఫిబ్రవరి 28 లోపు ఆస్తి పన్నులు వసూలు చేసే దిశగా కృషి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి తిరుమల గౌడ్, ఎంపిపి శారద, డిపిఓ శ్రీనివాస్, డివిజనల్ పంచాయతీ అధికారి సాయిబాబ, ఎంపిడిఓ చిన్న రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.