ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రారంభం
- కామారెడ్డి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ భార్గవ సుధీర్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 14 ( లోకంతీరు ) : సదాశివనగర్, బాన్సువాడ లో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించిన లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ భార్గవ సుధీర్ ఫిబ్రవరి 13వ తేదీలో సదాశివనగర్,మరియు ఫిబ్రవరి 14 వ తేదీన బాన్సువాడ లో,కామారెడ్డి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ భార్గవ సుధీర్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ అర్థిక అక్షరాస్యత పెంపొందించుకోవాలని, ఆర్థిక వ్యవహారాలు రిజర్వ్ బ్యాంక్ గుర్తించిన ఆర్థిక సంస్థల ద్వారా చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంస్థలలో ఆర్థిక మోసాలు జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మెన్ ద్వారా పరిష్కారం పొందవచ్చు అన్నారు.బ్యాంకులో అందించే సేవింగ్ పథకాలను, రుణ పథకాలను, బీమా పథకాలను, సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు ఆర్థిక అక్షరాష్ట కేంద్రాలు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు కెనరా బ్యాంకు ఇదివరకే జిల్లాలో 3 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను స్పాన్సర్ చేసిందని ప్రస్తుతం మరో మూడు ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను స్పాన్సర్ చేశామన్నారు.
రిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ మరియు కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను వివిధ మండలాల్లో స్థాపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మరియు బాన్సువాడ కెనర బ్యాంక్ మేనేజర్ కే. రవి కుమార్, మరియు శివ కుమార్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ భువనేశ్వర్, మరియు చంద్రకాంత్ ,ఎస్బిఐ బ్యాంకు మేనేజర్స్, రాజు మరియు శ్రీకాంత్ ,డిస్ట్రక్ కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ జయశ్రీ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొని ఆర్థిక అక్షరాస్య కేంద్ర ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ వి అశోక్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు.