వినోద్ స్మారక టోర్నమెంట్ ను ప్రారంభించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 03( లోకం తీరు న్యూస్ ) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల కేంద్రంలో యువ యూత్ ఆధ్వర్యంలో శనివారం వినోద్ స్మారక మెన్ కబడ్డీ, వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తింటి ముత్యంరెడ్డి, సుమో రాజేశ్వర్, పడాల గంగారెడ్డి, బద్దం అశోక్, మౌలానా, నరేశ్ కాంగ్రెస్ పార్టి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.