Take a fresh look at your lifestyle.

వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి…..

0 1,473

వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

బాల్కొండ,  ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) :  బాల్కొండ మండలంలోని బోదేపల్లి గ్రామంలో వరి పంటను పరిశీలించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి రైతులను కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి నాట్లు వేసి 15 నుంచి 25 రోజుల మధ్యలో ముగిపురుగు/ కాండం తొలచు పురుగు నివారణకు

1. కార్టపు హైడ్రా క్లోరైడ్  ప్లస్ ఇమా మెక్టీన్  బెంజయిట్ మూడు కిలోలు లేదా  క్లోరాంతర నిలిప్రోలు గుళికలు నాలుగు కిలోలు ఏదేని ఒకదానిని చల్లుకోవాలి

2. వరి పైరు నాటి  40 నుంచి 60 రోజుల మధ్యలో మోగి పురుగు నివారణకు కార్టపు హైడ్రా క్లోరైడ్   400 గ్రాములు లేదా క్లోరాంతర నిల్ప్రోలు 60 ml ఏదేని ఒకదానిని రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేయాలి.

3. యాసంగి వరిలో అగ్గి తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది కావున రైతులు అగ్గి తెగులు గమనించిన వెంటనే ట్రై సైక్లోజోల్ 120 గ్రాములు లేదా ఐసోప్రో త యోలిన్  300ఎంఎల్ ను ఏదేని ఒకదానిని రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేయాలి.

4. యూరియాను అధికంగా వాడడం వలన అగ్గితెగులు అధికంగా వచ్చే ఆస్కారం ఉంటుంది కావున అవసరం మేర మాత్రమే వాడాలి.

5. యాసంగిలో జింకు లోపం వరిలో కనబడుతుంది కావున జింకులోప నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ను లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్ ఏఈఓ నిహారిక రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.