Take a fresh look at your lifestyle.

బిసి సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి….

0 1,153

బిసి సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి

– పి డి యస్ యు  డిమాండ్

నిజామాబాద్, ఆగస్టు 24 ( లోకంతీరు ) :   నిజామాబాద్ నగరంలో గల బిసి బాలబాలికల సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కారించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం  ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి స్రవంతికు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా పి.డి.యస్.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాల నుండి వివిధ జిల్లాల నుండి పేద విద్యార్థులు తమ చదువుల నిమిత్తమై నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుందని తెలిపారు. కానీ విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా ప్రభుత్వ హాస్టల్లు లేకపోవడం, ఉన్న హాస్టల్లో మౌలిక వసతులు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా నగరంలో కేవలం బాలురకు మూడు బాలికలకు మూడు చొప్పున ప్రభుత్వ హాస్టల్లు ఉండడం బాధాకరమన్నారు. కాబట్టి విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా హాస్టల్లో వసతులను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. నాందేవాడ, మిర్చి కాంపౌండ్ బాలుర వసతి గృహం కూలిపోయే స్థితిలో ఉందని, విద్యార్థులు ప్రాణాలు అరచేతుల పెట్టుకుని ఉంటున్నారని తెలిపారు. వెంటనే బీసీ బాల బాలికల వసతి గృహాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిందిగా కోరారు. అదేవిధంగా విద్యార్థులకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాల్సిందిగా, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా కోరారు. హాస్టల్ వసతి కొరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి ఇవ్వాల్సిందిగా కోరారు. కళాశాలలకు సమీపంలో ఉండే విధంగా నూతన భవనాలు నిర్మించాల్సిందిగా కోరారు. పెండింగ్ లో ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాల అద్దే భవనాల బిల్లులను, విద్యార్థుల మెస్ కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వారానికి ఒక్కసారైనా జిల్లా అధికారులు సంక్షేమ వసతి గృహాలను సందర్శించి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సిందిగా కోరారు. సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యలన్నింటిని పరిష్కరించే విధంగా జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల విద్యార్థులు లు ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.యస్.యు నాయకులు నసీర్, సంతోష్, శన్ను వర్మ, నికిత, దివ్య రాణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.